News March 14, 2025
పిఠాపురం: డూప్లికేట్ కాకుండా జనసేన మీడియా పాస్‌లు

మరికొద్ది గంటలో జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. అయితే కొంతమంది మీడియా ముసుగులో హడావుడి చేస్తున్నారు.ఈ నేపథ్యం పురస్కరించుకుని ఎలాంటి డూప్లికేట్ పాస్‌లు తయారు చేయకుండా ఉండేందుకు హాలోగ్రామ్‌తో కూడిన మీడియా పాసులు జారీ చేశారు. అక్రిడేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే మీడియా పాస్ లిస్టు కలర్ జిరాక్స్ లేదా డూప్లికేట్ తయారు చేయకుండా హాలోగ్రామ్ పెట్టారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Similar News
News November 6, 2025
ఎల్ఐసీ Q2 లాభాలు ₹10,053Cr

FY25 రెండో త్రైమాసిక(Q2) ఫలితాల్లో ఎల్ఐసీ ₹10,053Cr నికర లాభాలను ఆర్జించింది. గతేడాది(₹7,621Cr)తో పోలిస్తే 32 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నాటికి మొత్తం ఆదాయం FY24తో పోలిస్తే ₹2.29L Cr నుంచి ₹2.39L Crకు పెరిగింది. నెట్ ప్రీమియం ఆదాయం ₹1.19L Cr నుంచి ₹1.26L Crకు చేరింది. ఇక సంస్థల ఆస్తుల విలువ 3.31 శాతం వృద్ధితో ₹57.23L Crకు పెరిగింది.
News November 6, 2025
10 రోజుల్లో నష్టపరిహారం: వికారాబాద్ కలెక్టర్

NH-167 రోడ్డు విస్తరణలో కట్టడాలు (ఆస్తులు) కోల్పోతున్న వారికి 10 రోజుల్లో నష్టపరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వాసితులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అయితే 107 మందికి చెందిన 55,114 స్క్వేర్ ఫీట్ల స్థల సేకరణకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్ పాల్గొన్నారు.
News November 6, 2025
ఫేక్ వీడియో కాల్స్‌తో మోసాలు.. జాగ్రత్త: పరిగి డీఎస్పీ

నకిలీ వీడియో కాల్స్ ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే స్పందించొద్దని ప్రజలకు సూచించారు. కొందరు వ్యక్తులు నగ్నంగా మాట్లాడి, ఆ దృశ్యాలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుంటారని తెలిపారు. ఇలాంటి మోసాలకు భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని, సైబర్ ఫిర్యాదుల కోసం ‘1930’కు కాల్ చేయాలని డీఎస్పీ కోరారు.


