News August 1, 2024
పిఠాపురం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా: MLC

పిఠాపురం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ప్రకటించారు. గురువారం పెన్షన్ల పంపిణీలో పాల్గొనేందుకు బుధవారం రాత్రి జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబుతో కలిసి పిఠాపురం చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీకి ఒక నియోజకవర్గాన్ని ప్రొటోకాల్ పరంగా సొంత నియోజకవర్గంగా ఎంపిక చేసుకునే ఆవకాశం ఉండడంతో తాను ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం: కలెక్టర్

జిల్లాకు చెందిన యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, అవసరమైన శిక్షణ సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ ఇండియా క్యాంపస్ హెడ్ మెర్లిన్ కలెక్టర్‌ని కలిశారు. సదర్లాండ్ సంస్థ రాజమండ్రిలో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు, అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తామని వివరించారు.
News November 4, 2025
ఓటర్ల సౌకర్యార్థం “Book a Call with BLO” సదుపాయం

ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ‘Book a Call with BLO’ నూతన సదుపాయాన్ని జిల్లాలో ఓటర్లు వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వారు NGSP స్టేట్ నోడల్ ఆఫీసర్లతో అక్టోబర్ 24న నిర్వహించిన సమావేశంలో ఓటర్ అనుభవాన్ని మెరుగుపరచడం, ఫెసిలిటేషన్ చర్యలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ మాడ్యూల్‌ను అమలులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
News November 4, 2025
ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: డీఈవో

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలకు (మార్చి 2026) ఫీజు చెల్లింపు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ వాసుదేవరావు మంగళవారం తెలిపారు. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి వారి ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి ఫెయిల్ అయినవారు, రెగ్యులర్ పరీక్ష అర్హత కోల్పోయినవారికి ఇది మంచి అవకాశం అని ఆయన వెల్లడించారు.


