News June 12, 2024
పిఠాపురం: పవర్‌స్టార్ పవన్ ఇక MINISTER పవన్‌గా

సినీనటుడిగా తెరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ 2008లో రాజకీయాల్లోకి రాగా.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ట్రస్ట్ ద్వారా సేవలందించారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత.. 2014లో జనసేన స్థాపించారు. అప్పటినుంచి ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. తాజాగా పిఠాపురం MLAగా గెలిచి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Similar News
News January 6, 2026
పోలీసుల ‘వాట్సాప్’ నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి!

ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే సేవలు పొందేలా ప్రభుత్వం ‘వాట్సాప్ గవర్నెన్స్’ను అందుబాటులోకి తెచ్చిందని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ప్రజలు తమ మొబైల్స్‌లో 9552300009 నంబరును సేవ్ చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఈ-చలాన్ చెల్లింపు, ఎఫ్.ఐ.ఆర్ (FIR) కాపీలు, కేసు దర్యాప్తు స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలు సమయాన్ని ఆదా చేసుకోవాలని ఎస్పీ కోరారు.
News January 5, 2026
తూ.గో: పోలీసు పీజీఆర్ఎస్కు 26 ఆర్జీలు

తూ.గో. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కు 26 ఆర్జీలు వచ్చినట్లు ఎస్పీ డి.నరసింహకిశోర్ తెలిపారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు.
News January 5, 2026
RJY: నేడు కలెక్టరేట్లో ‘రెవెన్యూ క్లినిక్’

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్‌తో పాటు ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని తహశీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయిలో డిప్యూటీ తహశీల్దార్లు PGRS నిర్వహిస్తారని స్పష్టం చేశారు. భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.


