News March 30, 2025

పిఠాపురం పోలీసులపై జిల్లా ఎస్పీ సీరియస్

image

ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలపై కాకినాడ జిల్లా ఎస్పీ విందు మాధవ్ పిఠాపురం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం రూరల్ ఎస్‌ఐ లంచం తీసుకోవడం, ఒక కేసులో అనుమానితుడు జీపు డ్రైవర్‌గా ఉండటం పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉండటం, కొన్ని కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడంపై ఎస్పీ బిందు మాధవ్ పిఠాపురం పోలీసులపై సీరియస్ అయ్యారు.

Similar News

News February 27, 2026

నర్సాపూర్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్‌లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తహశీల్దార్ శ్రీనివాస్, అధికారులున్నారు.

News February 27, 2026

సీబీఐపై కోర్టు తీవ్ర ఆగ్రహం

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలున్నాయంటూ కేసును కొట్టివేసింది. సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికించారని మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కాగా లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసు నడుస్తోంది.

News February 27, 2026

విశాఖ: లారీ డ్రైవర్ ఆత్మహత్య

image

తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్, గాజువాక బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ‌తో కంపెనీకి వచ్చిన విజ్జి అనే డ్రైవర్ అడ్మిన్ బిల్డింగ్ ఎదురుగా మైదానంలో లారీ ఆపి శుక్రవారం ఉదయం లారీ క్యాబిన్ తలుపుకి తాడు కట్టి ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.