News June 24, 2024

పిఠాపురం: ప్రైవేట్ టీచర్ల సమస్యలపై వర్మ హామీ

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ప్రైవేటు టీచర్ల సమస్యలు తీసుకెళ్తానని మాజీ MLA ఎస్వీఎస్ఎస్ వర్మ చెప్పారు. పిఠాపురం మమతా హైస్కూల్లో ఆదివారం జరిగిన ప్రైవేట్ టీచర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కూడా సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News January 3, 2026

RJY: ‘గిరిజన యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి’

image

రంపచోడవరం జిల్లాకు గిరిజన వీరుడు కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. తమ్మన్నదొర త్యాగాన్ని కేంద్రం గుర్తించినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గిరిజన యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

News January 3, 2026

గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

image

కొవ్వూరు ఎరినమ్మ ఘాట్ వద్ద శనివారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పట్టణ సీఐ పీ. విశ్వం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి సుమారు 60 ఏళ్లు పైబడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుడి వద్ద ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440796622కు కాల్ చేయాలన్నారు.

News January 3, 2026

ఈ నెల 3న రాజమండ్రిలో పర్యటించనున్న కమిషన్ చైర్‌పర్సన్

image

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ జనవరి 3న తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి 11 గంటలకు రాజమండ్రి చేరుకుంటారన్నారు. 12 గంటలకు రాజమండ్రిలో నిర్వహించనున్న ‘మహిళా విద్యావేత్తల సాధికారత –వృత్తి & వ్యక్తిగత సమతుల్యత’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.