News May 25, 2024
పిఠాపురం: రూ.50 నోట్ల ఎర చూపి రూ.6 లక్షల దోపిడి

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని కొండప్ప వీధికి చెందిన ధాన్యం వ్యాపారి నందిపాటి నారాయణమూర్తి శుక్రవారం SBI నుంచి రూ.6 లక్షల నగదు డ్రా చేసి బైక్పై ఇంటికి బయలు దేరారు. సీతయ్యగారితోట వద్దకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు వారి వద్ద ఉన్న రూ.50 నోట్లు కింద పడేసి మీ నగదు పడిపోయిందని ఆ వ్యాపారిని నమ్మించారు. ఆయన వద్ద ఉన్న రూ.6 లక్షలు కాజేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 3, 2026
రాజమండ్రిలో ‘మన శంకర వరప్రసాద్’ మూవీ సంబరాలు

రాజమండ్రి పుష్కరాల రేవులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ మూవీ సంబరాలు శనివారం అట్టహాసంగా జరిగాయి. మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 40 పడవలతో గోదావరి నదిలో ‘CHIRU’ ఆకారంలో విన్యాసాలు చేస్తూ సందడి చేశారు. ఈ వినూత్న వేడుకను చూసేందుకు అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. గోదావరి తీరం మెగా నామస్మరణతో మారుమోగింది.
News January 3, 2026
ఇన్ఛార్జ్ కలెక్టర్గా జేసీ వై.మేఘా స్వరూప్

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముస్సోరీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 5 నుంచి 30 వరకు ఆమె లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో ఉండనున్నారు. కలెక్టర్ గైర్హాజరీలో జేసీ వై.మేఘా స్వరూప్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
News January 3, 2026
ఏపీపీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం

ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్టులను ఈ నెల 5, 7, 10 తేదీల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో టి.సీతారామమూర్తి తెలిపారు. శనివారం రాజమండ్రిలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐవోఎన్ డిజిటల్ జోన్, రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.


