News March 13, 2025

పిఠాపురం రేపటి పవన్ ప్రసంగంపై సర్వత్రా అసక్తి..!

image

రేపు పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన అవిర్భావ సభపై రాజకీయంగా భారీ అసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 21 సీట్లలో విజయం సాధించడం డిప్యూటీ సీఎంగా మొదటిసారి జరుగుతున్న సభ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కపాడాలనే నినాదంతో దేశవ్యాప్తంగా పవన్ చరిష్మా పెరిగింది. దీనితో రేపు ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారని తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Similar News

News March 21, 2025

‘లబ్ధిదారులకు అదనపు సహాయం రూ.6.19 కోట్లు విడుదల’

image

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం కింద 4,240 మంది లబ్ధిదారులకు రూ.6.19 కోట్ల నిధులను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం తెలిపారు. క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఎఫ్‌టీఓ విడుదల చేసిన లబ్ధిదారులు గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు.

News March 21, 2025

‘తాగు నీటి సమస్యకు పర్యవేక్షక సెల్ ఏర్పాటు’

image

గ్రామీణ ప్రాంత ప్రజలు వేసవిలో తాగునీటి కొరత సమస్యలను తెలుసుకొని పరిష్కరించుటకు రాజమహేంద్రవరం జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌ అధికారి కార్యాలయంలో పర్యవేక్షక సెల్‌ ఏర్పాటు చేశారు. ఈమేరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌ అధికారి బి.వెంకటగిరి ప్రకటనలో తెలిపారు. తాగునీటి సమస్యలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు 91001 21190 నంబరుకు తెలియజేయాలన్నారు.

News March 20, 2025

తూ.గో : ఈ మండలాల ప్రజలకు హెచ్చరిక

image

తూ.గో జిల్లాలో నేడు ఎండలు విపరీతంగా ఉండనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. జిల్లాలోని గోకవరం, కొవ్వూరు, పెరవలి, రాజమండ్రి, రాజానగరం మండలాల్లో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆ జిల్లాలో ఎండలతో పాటు వడగాల్పులు కూడా వీస్తాయని బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!