News February 25, 2025

పిఠాపురం: వైరల్ అవుతున్న పవన్ AI ఫొటో

image

జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ AI ఫొటో వైరల్‌గా మారింది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పట్టభద్రుల MLC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కి నిన్న మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. అయితే ఆయన ఓటును అభ్యర్థిస్తూ AIతో చేసిన ఫొటోను కూటమి నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. 

Similar News

News December 5, 2025

జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ జానకి షర్మిల

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగ్‌లు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని స్పష్టం చేశారు. అలాగే ఆయుధాలు, పేలుడు పదార్థాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు వినియోగించడం కూడా నిషేధమని చెప్పారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News December 5, 2025

పుతిన్ సంపద ఎంత.. బిల్ గేట్స్ కన్నా ధనవంతుడా?

image

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో పుతిన్ ఒకరు. ఆయనకు ఏడాదికి రూ.1.25 కోట్ల జీతం వస్తుందని, 800 చ.అ. అపార్ట్‌మెంట్, ప్లాట్, 3 కార్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. కానీ పుతిన్ సంపద $200 బిలియన్లకు పైనే అని ఫైనాన్షియర్ బిల్ బ్రౌడర్ గతంలో చెప్పారు. ఇది బిల్ గేట్స్ సంపద ($113B-$128B) కన్నా ఎంతో ఎక్కువ. ఆయనకు విలాసవంతమైన ప్యాలెస్, షిప్, ఎన్నో ఇళ్లు, విమానాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

News December 5, 2025

MNCL: ఉపసంహరణ డెడ్ లైన్ రేపే.. అభ్యర్థులపై ఒత్తిడి..?

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లె రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రెండో విడత సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో వివిధ పార్టీల ముఖ్య నాయకులు రంగంలోకి దిగి నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఉపసంహరణకు ఒప్పించేందుకు బుజ్జగింపులు, బేరసారాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో పల్లె రాజకీయాలు రసవత్తరంగా మారాయి.