News March 20, 2025

పిఠాపురం సభపై పవన్ కళ్యాణ్ ట్వీట్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తన ‘x’ ఖాతా వేదికగా ..జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవే అంటూ ప్రకటన చేశారు. రాజకీయ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల అనంతరం సభా ప్రాంగణాన్ని శుభ్రపరిచి అందజేశామని అదే జనసేన సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు . 

Similar News

News October 20, 2025

రియాజ్ ఎన్‌కౌంటర్‌‌పై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబం హర్షం

image

TG: రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంపై కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత ఆనందం వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్‌పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు. రియాజ్ <<18056853>>కత్తితో దాడి<<>> చేయడంతో కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయిన విషయం తెలిసిందే.

News October 20, 2025

చుంచుపల్లి: బాంబు పేలి బాలుడి చేతికి తీవ్ర గాయం

image

దీపావళి పండుగనాడు టపాకాయలు కాలుస్తుండగా బాలుడి చేతికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం రాత్రి చుంచుపల్లి మండలంలో జరిగింది. చుంచుపల్లి తండా గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు బానోతు విక్కీ టపాకాయలు కాలుస్తుండగా చేతిలో బాంబు పేలింది. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

News October 20, 2025

కాసేపట్లో భారీ వర్షం..

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాసేపట్లో యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి ఉదయంలోపు వానలు పడతాయని పేర్కొన్నారు. అటు ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.