News March 4, 2025

పిఠాపురం: 14న జనసేనలోకి పెండెం దొరబాబు?

image

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కుటుంబ సమేతంగా సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దొరబాబును జనసేనలో చేర్చుకునేందుకు పవన్ సముఖంగా ఉన్నారన్న నేపథ్యంలో ఆయన జనసేనలో ఎప్పుడు చేరుతారనేది పిఠాపురంలో హాట్ టాపిక్‌గా మారింది. దొరబాబు అనుచరులతో పెద్ద ఎత్తున పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో పార్టీ చేరుతారని సమాచారం. దీనిపై అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Similar News

News March 4, 2025

మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు: సీపీ

image

మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ విభాగాల పోలీసు మహిళా అధికారులు పాల్గొన్నారు.

News March 4, 2025

కృష్ణా: తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఇరిగేషన్, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో వేసవిలో తాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

News March 4, 2025

దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

image

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవరం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.

error: Content is protected !!