News April 25, 2024

పిఠాపురం: 1989 నుంచి 2వ సారి ఎవ్వరూ గెలవలేదు

image

ఆధ్యాత్మిక పట్టణంగా పేరుగాంచిన పిఠాపురం ఓటర్లు ఎన్నికల్లో విభిన్న తీర్పుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇక్కడ ఇప్పటివరకు 16సార్లు ఎన్నికలు జరగగా 1989 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏఒక్క అభ్యర్థీ 2వసారి గెలిచిన దాఖలాలు లేవు. అయితే రానున్న ఎన్నికల్లో కొత్తగా పొటీచేస్తున్న పవన్ గెలుస్తారా లేదా సెంటిమెంట్‌కు భిన్నంగా 2009లో విజయం సాధించిన వంగా గీతకు మరోసారి పట్టంకడతారా అనేది ఆసక్తిగా మారింది. – మీ కామెంట్..? 

Similar News

News January 8, 2026

రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.

News January 8, 2026

బ్లో అవుట్ వివరాలు సీఎంకు తెలిపిన ఎంపీ హరీష్

image

ఇరుసుమండ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీ హరీశ్ బాలయోగిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయంలో కలిసిన ఎంపీని ఘటన తీవ్రతను అడిగారు. త్వరలోనే బ్లో అవుట్ ప్రాంతాన్ని సందర్శించి, ఏరియల్ సర్వే నిర్వహిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు హరీశ్ తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News January 7, 2026

సంక్రాంతికి నిడదవోలు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు: DM

image

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ధనుంజయ్ తెలిపారు. ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు నిడదవోలు – విజయవాడ మార్గంలో నాలుగు ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రధాన ప్రాంతాలకు సర్వీసులను ఏర్పాటు చేస్తామని, ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.