News July 1, 2024
పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొస్తా: పవన్

పిఠాపురం నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని స్థానిక MLA, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం అభివృద్ధి కోసం ఏం చేయగలనా..? అంటూ నిత్యం ఆలోచిస్తానని, ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చాకే తనను ఊరేగించండని అక్కడి ప్రజలతో అన్నారు. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తానన్నారు. డొక్కా సీతమ్మ పేరుతోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News November 27, 2025
జిల్లాలో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి: జేసీ

ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనాగా నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ వెల్లడించారు. గురువారం నాటికి మొత్తం 34,737 కొనుగోలు కూపన్లు రైతులకు జారీ చేశామని తెలిపారు. జిల్లాలోని 18 మండలాల్లో ఏర్పాటు చేసిన 201 కొనుగోలు కేంద్రాల ద్వారా, ఇప్పటివరకు 21,794 మంది రైతుల నుంచి 1,61,611.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 27, 2025
తూ.గో రైతులకు ముఖ్య గమనిక

ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాల పరిష్కారం కోసం స్థానిక బొమ్మూరు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని వెల్లడించారు. రైతులు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా 8309487151 నంబర్‌కు సంప్రదించి సహాయం పొందవచ్చని సూచించారు.
News November 27, 2025
రాజమండ్రి: సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్‌కు అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఏడీ బి. శశాంక తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 30లోగా రాజమండ్రిలోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. డిసెంబర్ 5న జరిగే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి విజయవాడలో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.


