News May 11, 2024

పిఠాపురానికి నేడు జగన్.. రామ్‌చరణ్

image

ప్రచారఘట్టానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా.. పిఠాపురంలో క్లైమాక్స్ ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ వంగా గీతకు మద్దతుగా ప్రసంగించి ఇక్కడే ప్రచారానికి ఫిన్షింగ్ టచ్ ఇవ్వనున్నారు. అటు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సైతం తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి పూజలు చేయనున్నారు. పూజల అనంతరం బాబాయ్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చరణ్ ప్రచారం చేస్తారా..?, ఏమైనా మాట్లాడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

Similar News

News December 19, 2025

తూ.గో జిల్లాలో ఉద్యోగాలు.. 12 రోజులే గడువు!

image

రాజమండ్రిలోని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఛీఫ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జీ సునీత శుక్రవారం తెలిపారు. అర్హత కలిగిన న్యాయవాదులు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలు జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

News December 19, 2025

రేపు పాఠశాలలో ‘ముస్తాబు’- కలెక్టర్

image

‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం(డిసెంబర్ 20న) జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా ఒక ప్రత్యేక అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలల సుందరీకరణలో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఆమె వివరించారు.

News December 19, 2025

రాజమండ్రి: పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి- DMHO

image

ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని DMHO డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఒక విడత పోలియో చుక్కలు వేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 1,89,550 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టగా, ఇందుకు 2,31,250 డోసుల పోలియో వ్యాక్సిన్ సిద్ధం చేశామన్నారు.