News May 3, 2024

‘పిడుగుపాటుకు రైతు మృతి’

image

ములకలపల్లి: పూసుగూడెం గ్రామపంచాయతీ ఒడ్డు రామవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఈ క్రమంలో మార్కెట్ యార్డులో ఉన్న బోడ శివరాం అనే రైతు పిడుగుపాటుకు గురై మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గుగులోతు శ్రీను అనే మరో రైతుకు గాయాలయ్యాయి. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 14, 2024

ఖమ్మంలో గ్రూప్ -III పరీక్షకు 87 కేంద్రాలు

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -III పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కమిషన్ ఛైర్మన్ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కమిషన్ సభ్యులతో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో 27,984 మంది పరీక్ష రాస్తున్నరని వారి కోసం 87 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాల రెవెన్యూ అధికారి రాజేశ్వరి, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.

News November 14, 2024

జూలూరుపాడు: యువతి హత్య UPDATE

image

జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో స్వాతి (28)ని భర్త భానోత్ భద్రం హత్య చేసి <<14604036>>పత్తి <<>>చేనులో పాతి పెట్టిన సంగతి తెలిసిందే. నిందితుడి వివరాల ప్రకారం.. ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఈ నెల 9న స్వాతిని కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం అతని తల్లి సహాయంతో ఓ సంచిలో మూటగట్టి చేనులో పాతిపెట్టినట్లు తెలిపాడు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది.

News November 14, 2024

ఖమ్మం: పార్టీ కార్యకర్తలకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

image

ఈనెల 15న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఆడంబరాల కార్యక్రమాలను నిర్వహించొద్దని, జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, కేక్ కట్టింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని తన అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తెలుగు ప్రజలు తనపై చూపించిన అభిమానంతో జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని తెలిపారు.