News May 12, 2024

పిడుగుపాటుతో తాత, మనుమడు మృతి.. కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్బ్రాంతి

image

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుతో తాత, మనుమడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షం కురువడంతో వరి ధాన్యంపై కవర్ కప్పేందుకు వెళ్లిన శ్రీరాములు(43), శివరాజ్(విశాల్)(13) పిడుగుపాటుతో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని సహాయక సహకారాలను త్వరలో అందిస్తామని చెప్పారు.

Similar News

News March 5, 2026

హవేలీఘనాపూర్: విద్యుదాఘాతంతో రైతు మృతి

image

హవేలీఘనాపూర్ మండలం బి. తిమ్మాయిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు ఎర్ర బిక్షపతి(42) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నాగమణి, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News March 5, 2026

‘పీఎం సూర్య ఘర్’తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలి: కలెక్టర్

image

ప్రజలు తమ గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లో ‘పీఎం సూర్య ఘర్’ అవగాహన వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం జిల్లాలోని గ్రామాలు, మండలాల్లో పర్యటించి సౌర విద్యుత్ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 5, 2026

మెదక్: తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు

image

కొల్చారం మండలం సీతారాంపూర్ తండాలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మాలావత్ నాని అనే యువకుడు తన తల్లి లక్ష్మిపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం బాధితురాలిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.