News April 17, 2024

పిడుగురాళ్లలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం పోలేరమ్మ గుడి వెనుక గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుదని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలన్నారు. 

Similar News

News September 9, 2024

మంగళగిరి: ప్రజా వేదిక వారం రోజులు రద్దు

image

అకాల వర్షాల కారణంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం వారం రోజుల పాటు రద్దు అయినట్లు కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు తెలిపారు. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యలయంలో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం ఇవన్నీ ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు అయినట్లు తెలిపారు.

News September 8, 2024

మంగళగిరి: ప్రజా వేదిక వారం రోజులు రద్దు

image

అకాల వర్షాల కారణంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో జరగాల్సిన ప్రజా వేదిక” కార్యక్రమం వారం రోజుల పాటు రద్దు అయినట్లు కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు తెలిపారు. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యలయంలో జరగాల్సిన “ప్రజా వేదిక” కార్యక్రమం ఇవన్నీ ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు అయినట్లు తెలిపారు.

News September 8, 2024

గుంటూరు: ప్రజా సమస్యల పరిష్కార రద్దు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు పరిచినట్లు గుంటూరు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి IAS ఆదివారం తెలిపారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.