News March 19, 2025

పిడుగురాళ్ల: అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కమిషనర్

image

పిడుగురాళ్ల పట్టణ పరిధిలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్‌ను మంగళవారం పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. క్యాంటీన్ పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. భోజనం విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. అనంతరం ప్రజలతో కలిసి క్యాంటీన్‌లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 20, 2025

దీపంలోని దేవతలు.. మన కర్మలకు సాక్షిభూతులు

image

దీపం.. మన జీవితంలో ఓ భాగం. రోజూ ఉభయ సంధ్యలలో ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీప ప్రజ్వలన చేసిన తర్వాతే పండుగలు, పూజలు, శుభకార్యాలు, వేడుకలు ప్రారంభిస్తాము. వివాహాలనూ అగ్నిసాక్షిగా చేసుకుంటాం. దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉండి అనుగ్రహిస్తారని నమ్మకం. అందుకే దీపం వెలిగించటం అత్యంత ప్రధానమైనది. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి దీపావళి పండగను మహర్షులు ఏర్పాటు చేశారని ఓ విశ్వాసం.

News October 20, 2025

బండ్ల గణేశ్ ఇంటి నిండా టపాసులే

image

దీపావళి సందర్భంగా బండ్ల గణేశ్ తన ఇంట్లో వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇంటి నిండా టపాసులు పరిచి ఫొటోని షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘తెలుగు లోగిళ్లలో ఆరోగ్య, ఆనంద, విజయాల కాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు’ అంటూ బండ్ల ట్వీట్ చేశారు.

News October 20, 2025

NZB: రియాజ్ 47 కేసుల్లో అరెస్టు, 20 కేసుల్లో నిందితుడు

image

రియాజ్ ఇప్పటి వరకు 47 కేసుల్లో అరెస్టు అయినట్లు నిజామాబాద్ రూరల్ SHO ఆరీఫ్ తెలిపారు. ఇంకా 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. సమద్ డాన్ అండతో, రియాజ్ పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు చెప్పారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కూడా కత్తితో దాడి చేశాడని, సారంగాపూర్‌లో పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆసిఫ్‌ను కత్తితో తీవ్రంగా గాయపరిచాడని వివరించారు.