News January 28, 2025
పిడుగురాళ్ల: యువతిపై యువకుడి దాడి

గుత్తికొండ ఫారస్టెలో యువతిపై యువకుడు దాడి చేసాడు. పోలీసులు పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నకరికల్లు యువతి కారంపూడి యువకుడికి మధ్య పరిచయం ఏర్పడింది. వీరు అప్పుడప్పుడు గుత్తికొండ ఫారెస్ట్ ఏరియాలో కలిసేవాళ్లు. ఈ క్రమంలో అక్కడ వారు మాట్లాడుకుంటుండగా యువతి వేరే వ్యక్తితో మాట్లాడుతుందన్న అనుమానంతో దాడికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 10, 2025
భామిని: ఇసుక ర్యాంప్ గుంతలలో మునిగిపోయి వ్యక్తి మృతి

భామిని మండలంలోని బిల్లుమడ పంచాయతీ పరిధి పాత బిల్లుమడ గ్రామానికి చెందిన కోటిలింగాల చక్రో (70) వంశధార నదీ తీరంలో స్నానానికి వెళ్లి మృతి చెందాడు. నదిలో ఇసుక ర్యాంప్ గుంతలో నీటిలో మునిగిపోయి మరణించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానిక గ్రామస్థులు హుటాహుటిన నదీ తీరానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 10, 2025
ప్రశాంతమైన జీవితానికి 8 సూత్రాలు

– ఎదుటివారు చెప్పేది విన్నాక మాట్లాడు
– ఎక్కువ గమనించు
– తక్కువ మాట్లాడు
– ఎప్పుడూ నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు
– నేర్చుకోవడం మానేయకు
– ఈగో, వాదించడం, కోపాన్ని కంట్రోల్ చేసుకో
– ఎక్కువ నవ్వుతూ తక్కువ చింతించు
– ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అని తెలుసుకో
News February 10, 2025
13 ఏళ్లుగా ఒకే ఒక్కడు.. రోహిత్ శర్మ

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు వరుసగా POTM అవార్డు అందుకున్న ప్లేయర్‌గా నిలిచారు. 2013 నుంచి 2025 వరకు ఏటా కనీసం ఒక మ్యాచ్‌లో అయినా హిట్‌మ్యాన్ ఈ అవార్డు అందుకుంటున్నారు. నిన్న ఇంగ్లండ్‌పై 90 బంతుల్లో 119 రన్స్ చేసిన రోహిత్ విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.