News July 4, 2024
పిన్నెల్లికి జగన్ వంత పాడటం సిగ్గుచేటు: మంత్రి స్వామి

సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వంతపాడటం సిగ్గుచేటని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో వైసీపీ శ్రేణులు మారణ హోమం సృష్టించాయని ఆయన మండిపడ్డారు. ఎలక్షన్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినా జగన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదని విమర్శించారు.
Similar News
News November 24, 2025
రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్‌కి గురై..

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
News November 24, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.