News June 28, 2024

పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రి కాకాణి

image

మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కలిశారు. పిన్నెల్లిపై అనేక కేసులు బనాయించి జైలులో పెట్టడం హేయమైన చర్యని కాకాణి అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, అండగా నిలిచి సంఘటితంగా పోరాడుతామని ఆయన చెప్పారు.

Similar News

News October 27, 2025

జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ పరిపాలన అధికారి తుమ్మా విజయ్ కుమార్ బొకే అందించి అభినందించారు. అనంతరం పలు సమస్యలను అయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విజయ్ తెలిపారు.

News October 27, 2025

రేపు జూనియర్ కళాశాలలకు సెలవు: నెల్లూరు RIO

image

నెల్లూరు జిల్లాలో మంగళవారం అన్ని జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు RIO వరప్రసాద్ రావు తెలిపారు. ‘మెంథా తుఫాన్’ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 27, 2025

లోతట్టు ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

image

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా 15 మొబైల్‌ వాహనాల ద్వారా కూరగాయలను విక్రయించే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఈ మొబైల్‌ వాహనాలను పంపి ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.