News February 6, 2025

పిన్నెల్లి అనుచరుణ్ని కోడి మాంసం పట్టించింది 

image

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు తురక కిషోర్ సినీ ఫక్కిలో హైదరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న కిషోర్ కోడి మాంసం కోసం తన మొబైల్ నుంచి ఫోన్ పే వాడుతూ ఉండడం గుర్తించారు. పోలింగ్ రోజున అల్లర్లు, దాడులు, పాత కేసులు, తీవ్ర నేరారోపణలున్న కిషోర్‌ను హైదరాబాద్ జైపూరి కాలనీలో చికెన్ స్టాల్ వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Similar News

News November 16, 2025

ఏపీకే ఫైలు ఓపెన్ చేయొద్దు: సీఐ యాదగిరి

image

చరవాణీలకు వచ్చే ఏపీకే ఫైలు తెరవొద్దని నరసాపురం పట్టణ సీఐ బి.యాదగిరి ప్రజలకు సూచించారు. ఆయన ఫోన్‌కు వాహన అపరాధ రుసుము చలానా పెండింగ్ ఉన్నట్లుగా మెసేజ్ వచ్చింది. ఆ ఫైలు సందేశాన్ని ప్రజలకు అవగాహన నిమిత్తం సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచారు. అటువంటి ఫైళ్లను తెరవొద్దని, తెరిస్తే ఫోన్ హ్యాక్ అయి సైబర్ నేరగాళ్ల చేతికి బ్యాంకు ఖాతాలు, పాస్‌వర్డ్ చేరే ప్రమాదం ఉందని ఆయన సూచించారు.

News November 16, 2025

నేడు నాన్ వెజ్ తినవచ్చా?

image

కార్తీక మాసంలో రేపు(చివరి సోమవారం) శివాలయాలకు వెళ్లేవారు, దీపారాధన, దీపదానం చేయువారు నేడు నాన్ వెజ్ తినకూడదని పండితులు సూచిస్తున్నారు. అది కడుపులోనే ఉండి రేపటి పూజకు అవసరమైన శరీర పవిత్రతను దెబ్బ తీస్తుందని అంటున్నారు. ‘మాంసాహారం రజోతమో గుణాలను ప్రేరేపించి, దైవారాధనలో ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి శివానుగ్రహాన్ని పొందడానికి, పూజ ఫలం కలగడానికి నేడు సాత్విక ఆహారం స్వీకరించడం ఉత్తమం’ అంటున్నారు.

News November 16, 2025

జుట్టు పొడిబారకుండా ఉండాలంటే?

image

పొడిబారి ఉన్న కురులకు గాఢత తక్కువగా, తేమను పెంచే షాంపూలను ఎంచుకోవాలి. పొడి జుట్టు ఉన్నవారు సల్ఫేట్‌ ఫ్రీ ఫార్ములాతో ఉన్న మాయిశ్చరైజింగ్‌ షాంపూలను ఎంచుకోవాలి. తేమను నిలిపే హైలురోనిక్‌ యాసిడ్, స్క్వాలేన్‌ వంటివి ఉండేలా చూసుకోవాలి. తలస్నానం చేశాక కండిషనర్‌ తప్పనిసరిగా రాసుకోవాలి. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి పోషకాల లేమి ఏమైనా ఉంటే… సప్లిమెంట్స్‌ వాడాల్సి ఉంటుంది.