News February 6, 2025
పిన్నెల్లి అనుచరుణ్ని కోడి మాంసం పట్టించింది

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు తురక కిషోర్ సినీ ఫక్కిలో హైదరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న కిషోర్ కోడి మాంసం కోసం తన మొబైల్ నుంచి ఫోన్ పే వాడుతూ ఉండడం గుర్తించారు. పోలింగ్ రోజున అల్లర్లు, దాడులు, పాత కేసులు, తీవ్ర నేరారోపణలున్న కిషోర్‌ను హైదరాబాద్ జైపూరి కాలనీలో చికెన్ స్టాల్ వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Similar News
News March 27, 2025
HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.
News March 27, 2025
షాకింగ్: అరణ్యంలో చిన్నారి మావోయిస్టులు!

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో బాల మావోయిస్టులను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన సారయ్య వద్ద లభ్యమైన లేఖలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. గెరిల్లా యుద్ధం కోసం 130 మంది బాల బాలికలను రిక్రూట్ చేసుకున్నారు. 9 నుంచి 11 ఏళ్ల చిన్నారులు 40 మంది, 14 నుంచి 17 ఏళ్లలోపు వారు 40 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరికి స్నైపర్ గన్స్, IED, ఫైటింగ్, అటాకింగ్ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నారు.
News March 27, 2025
కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 40.0°C నమోదు కాగా, జమ్మికుంట 39.7, తిమ్మాపూర్ 39.6, మానకొండూర్, కరీంనగర్ 39.3, చిగురుమామిడి 39.2, వీణవంక, రామడుగు 38.8, సైదాపూర్ 38.7, శంకరపట్నం, గన్నేరువరం 38.4, హుజూరాబాద్ 38.2, కొత్తపల్లి 38.1, కరీంనగర్ రూరల్ 37.9, ఇల్లందకుంట 37.7, చొప్పదండి 37.6°C గా నమోదైంది.