News October 30, 2024

పిన్నెల్లి బెయిల్ షరతులపై ముగిసిన వాదనలు

image

ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ షరతులను సడలించాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా, పోలీసుల తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడంతో మంగళవారం వాదనలు ముగిశాయి. నవంబర్ 4వ తేదీన తీర్పు వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది. సింగపూర్‌లో కుమారుడి విద్యాభ్యాసం కోసం తాను వెళ్లాల్సి ఉందని తన పాస్‌పోర్ట్ వెనక్కి ఇప్పించాలని కోరారు.

Similar News

News November 10, 2024

గుంటూరు: ఐదవ సారి రక్తదానం చేసిన శ్రీనివాస్ 

image

విజయవాడలోని ఓ హాస్పిటల్లో ఆపరేషన్ సమయంలో ఓ పేషెంట్‌కు రక్తం తక్కువగా ఉండటంతో 0+ బ్లడ్ కావాలని డాక్టర్ సూచించారు. కుటుంబసభ్యులు వెంటనే పొన్నూరుకు చెందిన ‘పొన్నూరు బ్లడ్వెల్ఫేర్ అసోసియేషన్’ సంస్థను సంప్రదించారు. దీంతో సంస్థ సభ్యుడు శ్రీనివాస్ స్పందించి 5వ సారి రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో ఆదుకున్న శ్రీనివాసుకు పేషంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

News November 9, 2024

గుంటూరు: బీఈడీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు-2024లో నిర్వహించిన బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News November 9, 2024

మేం కేసుపెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయండి: అంబటి

image

రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను పక్కదారి పట్టించడానికి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నాయకులతో కలిసి శనివారం ఎస్పీకి అంబటి వినతిపత్రాన్ని సమర్పించారు. పోలీసులకు ఇదే ధర్మమైతే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయాలన్నారు.