News August 7, 2024
పిప్పిరి గ్రామానికి వరాలు కురిపించిన డిప్యూటీ సీఎం

పాదయాత్ర ప్రారంభానికి తొలి అడుగు నేలైన బజారత్నుర్ పిప్పిరి గ్రామాన్ని దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పర్యటనలో వరాల జల్లులు కురిపించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 45 కోట్లు, పిప్పిరిలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించారు. బుగ్గారం, తేజ్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
Similar News
News November 8, 2025
తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
News November 8, 2025
గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.