News January 12, 2025
పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తూ పెంచాలి: మంత్రి అనిత

మంత్రి అనిత శనివారం విజయవాడలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తూ పెంచాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండేందుకు తర్వాతి తరంలో సామాజిక స్పృహ నింపాల్సిన బాధ్యత ప్రతి తల్లిపై ఉందన్నారు. బాలలకు క్రమశిక్షణ నేర్పేలా మొదటి పోలీసింగ్ తల్లి దగ్గరే మొదలవ్వాలన్నారు.
Similar News
News February 18, 2025
కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
News February 17, 2025
గన్నవరం: రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నట్లు తెలిసింది. బెంగళూరు నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్ళనున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినట్లు సమాచారం. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టై రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
News February 17, 2025
తోట్లవల్లూరు: ‘రేడియం స్టిక్కర్లు లేక ప్రమాదాలు’

తోట్లవల్లూరుల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కండక్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్ మీద వెళ్తూ ఎడ్ల బండిని ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందారు. ఎడ్ల బండ్లకు వెనుక రేడియం స్టిక్కర్స్ అంటించకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఈ తరహా ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.