News May 25, 2024
పిల్లలతో భిక్షాటన.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

చిన్నారులతో భిక్షాటన చేయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప.గో జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి దందా సాగుతోందని, పట్టుబడితే శిక్షార్హులవుతారని అన్నారు. భీమవరం బస్టాండ్‌లో శుక్రవారం ఓ బాలుడిని గుర్తించి సంరక్షణ నిమిత్తం ఏలూరు వసతి గృహానికి తరలించినట్లు చెప్పారు. ఇలాంటి చిన్నారులు కనిపిస్తే 1098 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని రాజేష్ కోరారు.
Similar News
News February 17, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పీజీఆర్ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియచేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.
News February 16, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 17 సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను (పీజీఆర్ఎస్) జిల్లా వ్యాప్తంగా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. ఆదివారం కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు.
News February 16, 2025
నిడమర్రులో యువకుడి దారుణ హత్య

ఏలూరు జిల్లా నిడమర్రులోని బావాయిపాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మాది ఏసురాజు (26) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే యువకుడి చేయి నరికేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి నిడమర్రు SI చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.