News November 19, 2025
పిల్లల్లో జలుబు తగ్గించే చిట్కాలు ఇవే

* పిల్లలను హైడ్రేట్ చేయడానికి గోరు వెచ్చని నీరు, సూప్స్, కొబ్బరి నీళ్లు ఇవ్వండి. దీనివల్ల వారి శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. * తల కాస్త ఎత్తులో పెట్టుకుని పడుకునేలా చేయండి. * సెలైన్ నాజిల్ డ్రాప్స్ వాడండి. ఏడాది లోపు పిల్లల ముక్కులో నాలుగైదు గంటలకోసారి 2 డ్రాప్స్, అంతకంటే పెద్ద పిల్లల్లో 3-4 డ్రాప్స్ వేయండి. * విటమిన్-C ఉండే జామ, కివీ, ఆరెంజ్ పండ్లు ఇవ్వండి. దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
Similar News
News April 5, 2026
మరో అమెరికన్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్?

ఇరాన్‌లో కూలిన F-15E యుద్ధ విమానంలోని రెండో పైలట్‌ను కాపాడినట్లు ట్రంప్ ప్రకటించిన గంటల్లోనే అమెరికాకు మరో షాక్ తగిలినట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న మరో విమానాన్ని కూల్చినట్లు IRGC ప్రకటించింది. ఇస్ఫహాన్ సౌత్‌లో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా ఇంకా ధ్రువీకరించలేదు.
News April 5, 2026
బాలీవుడ్‌లో దారుణమైన అంశమిదే: డైరెక్టర్ ప్రియదర్శన్

బాలీవుడ్ కల్చర్‌పై ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ అసహనం వ్యక్తం చేశారు. ‘అక్కడ సెట్‌లో నలుగురు యాక్టర్లతో పాటు 40-60 వర్కర్లు ఉంటారు. నటులకు జుట్టు లేకపోయినా సరిచేస్తూ, తాకుతూ ఉంటారు. నటుల చుట్టూ ఉండే సామగ్రి నా డైరెక్షన్ సెటప్ కంటే ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్‌లో కొనసాగుతున్న దారుణమైన అంశం ఇదే. ఇలాంటివి నాకు నచ్చవు. సౌత్ ఇండస్ట్రీలో ఇలా ఉండదు. వర్కర్లు సెట్‌కు బయటే ఉంటారు’ అని పేర్కొన్నారు.
News April 5, 2026
ధోనీ రిటైర్మెంట్‌పై అంబటి రాయుడి అంచనా ఇదే!

IPLకు ధోనీ రిటైర్మెంట్‌పై అంబటి రాయుడు చేసిన ప్రిడిక్షన్ ఇప్పుడు SMలో వైరలవుతోంది. IPL 2025 సీజన్ తర్వాత RCBతో ధోనీ మళ్లీ ఆడే అవకాశం లేదని రాయుడు అంచనా వేశారు. దీంతో పరోక్షంగా ధోనీ కెరీర్ ముగిసిందని హింట్ ఇచ్చారని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాగే కోహ్లీ కంటే ముందే ధోనీ IPL నుంచి తప్పుకొంటారన్నారు. CSK స్థాయిలో రాబోయే పదేళ్లలో RCB ట్రోఫీలు గెలిచే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.


