News February 3, 2025
పిసినికాడ సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
అనకాపల్లి మండలం పిసినికాడ సమీపంలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపూజీ అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బాబుజీ రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన అనంతరం కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Similar News
News February 3, 2025
HYD: రాచకొండ సీపీ సుధీర్ బాబు సమీక్షా సమావేశం
రాచకొండ కమిషనరేట్ ఐటీ సెల్ విభాగ అధికారులు, సిబ్బందితో ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ సెల్ సోషల్ మీడియా, సీసీటీఎన్ఎస్, కోర్ టీమ్, సీఈఈఆర్, ప్రజావాణి ఫిర్యాదుల వంటి పలు విభాగాల పనితీరును, ఫలితాల ప్రగతిని కూలంకషంగా పరిశీలించారు.
News February 3, 2025
సంజూకు గాయం.. 6 వారాలు ఆటకు దూరం!
ఇంగ్లండ్‌తో 5వ టీ20లో ఆర్చర్ వేసిన బంతి సంజూ శాంసన్ చూపుడు వేలికి తగిలి గాయమైన విషయం తెలిసిందే. నొప్పితో అతను వికెట్ కీపింగ్‌కు కూడా రాలేదు. కాగా, శాంసన్ వేలికి ఫ్రాక్చర్ అయిందని 4-6 వారాల పాటు బ్యాట్ పట్టలేరని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విశ్రాంతి తీసుకొని నేరుగా మార్చిలో ప్రారంభమయ్యే IPL ఆడొచ్చని పేర్కొన్నాయి. సంజూ ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదు.
News February 3, 2025
ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా?: MLC కవిత
BCల జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని, గతంతో పోల్చితే వారి జనాభా ఎలా తగ్గుతుందని MLC కవిత విమర్శించారు. ‘TGలో ఏ లెక్కన చూసినా 50-52% BCలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం 46.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరం. సకల జనుల సర్వేకు, ఇప్పటి సర్వేకు 21 లక్షల BC జనాభా తేడా కనిపిస్తోంది. OCల జనాభా ఎక్కువ కనిపిస్తోంది. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీల, SC, ST జనాభా తగ్గుతుందా?’ అని ప్రశ్నించారు.