News February 3, 2025
పిసినికాడ సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

అనకాపల్లి మండలం పిసినికాడ సమీపంలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపూజీ అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బాబుజీ రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన అనంతరం కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Similar News
News February 16, 2025
మహిళా నిర్మాతపై విచారణకు కోర్టు ఆదేశాలు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై ముంబైలోని ఓ కోర్టు విచారణకు ఆదేశించింది. ఆమె నిర్మించిన ఓ వెబ్ సిరీస్‌లో భారత జవాన్లను అవమానపరిచేలా సన్నివేశాలున్నాయని వికాస్ పాఠక్ అనే యూట్యూబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి యూనిఫామ్‌లో ఓ నటుడితో అభ్యంతరకర సన్నివేశాలు చేయించారని అందులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేటు కోర్టు, ఏక్తాపై విచారణ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించింది.
News February 16, 2025
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది: PM మోదీ

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘సన్నిహితుల్ని కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని తెలిపారు.
News February 16, 2025
నారాయణఖేడ్: కారు ఆటో ఢీకొని నలుగురుకి గాయాలు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ఆటో ఢీకొని నలుగురికి గాయాలైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మంగల్ పేట బస్ డిపో వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఎదురుగా నారాయణఖేడ్ వైపు వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. కారు బోల్తా పడినప్పటికీ కారులో ఉన్న వ్యక్తుల ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదన్నారు.