News March 1, 2025

పి.గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

పి.గన్నవరం బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన ట్రక్కు ఆటో డ్రైవర్ ఇంజరపు రామకృష్ణ (37) మృతి చెందాడు. రాజమండ్రి నుంచి ఈదరాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలికిపురం నుంచి ఆలమూరు వెళ్తున్న ట్రాక్టర్ – ఆటో ఢీ కొనడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పి.గన్నవరం ఎస్ఐ శివకృష్ణ కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News November 15, 2025

గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలి: SP

image

బాపట్ల జిల్లాకు వస్తున్న గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సూచించారు. సూర్యలంక వద్ద గవర్నర్ పర్యటించనున్న ప్రాంతాలను ఆయన శనివారం పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. కాన్వాయ్ వచ్చే సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, తిరిగి వెళ్లే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పాల్గొన్నారు.

News November 15, 2025

నిర్మల్: రేపటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం

image

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లెర్నింగ్ సెంటర్(103)లో 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి తరగతులు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ M.సుధాకర్, కోఆర్డినేటర్ U.గంగాధర్ తెలిపారు. డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు సంబంధించి 1, 3&5 సెమిస్టర్ తరగతులు ఉంటాయన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని కావాలన్నారు.

News November 15, 2025

విశాఖలో కూడా ఫిట్నెస్ టెస్ట్‌లకు అనుమతులు: మంత్రి

image

గంభీరంలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ I&Cవెహికల్ ఫిట్నెస్ సెంటర్‌ను రవాణాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డీటీసీ ఆర్సిహెచ్ శ్రీనివాస్‌తో కలిసి శనివారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి టెస్టింగ్ మెషినరీ పనులను వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. విశాఖలో కూడా రవాణా వాహనాల ఫిట్నెస్ టెస్ట్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. దీంతో రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయవచ్చని పేర్కొన్నారు.