News February 16, 2025

పి.గన్నవరంలో 18 అంగుళాల దూడ

image

18 అంగుళాల ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన చేగొండి సత్యనారాయణ అనే పాడి రైతుకు చెందిన ఆవుకు శనివారం ఈ దూడ పుట్టింది. బుడి బుడి అడుగులతో ముద్దొస్తున్న ఈ పుంగనూరు గిత్తను చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు. 

Similar News

News November 20, 2025

HYD: మంత్రి శ్రీహరిని కలిసిన చిన్న శ్రీశైలం యాదవ్

image

మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి వాకిటి శ్రీహరిని చిన్న శ్రీశైలం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తన కుమారుడు నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు.

News November 20, 2025

అరుదైన వైల్డ్‌లైఫ్ ఫొటో.. మీరూ చూసేయండి!

image

ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అత్యంత అరుదైన క్షణాన్ని బంధించారు. సెంట్రల్ అమెరికాలోని ‘కోస్టారికా’లో కనిపించే అత్యంత విషపూరితమైన పాము మీద దోమ వాలి.. ప్రశాంతంగా రక్తాన్ని పీల్చింది. ఇది గమనించిన ఫొటోగ్రాఫర్(twins_wild_lens) క్లిక్ మనిపించగా తెగ వైరలవుతోంది. ఈ రకం పాములు చెత్తలో కలిసిపోయి ఎంతో మంది ప్రాణాలు తీశాయని తెలిపారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ నిక్ వోల్కర్ కూడా ఈ ఫొటోను ప్రశంసించారు.

News November 20, 2025

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై వరంగల్ పోలీసుల కఠిన చర్యలు!

image

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు వరంగల్ పోలీసు శాఖ విస్తృత స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లపై ప్రత్యేక దాడులు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను తనిఖీ చేస్తున్నామన్నారు.