News February 16, 2025

పి.గన్నవరంలో 18 అంగుళాల దూడ

image

18 అంగుళాల ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన చేగొండి సత్యనారాయణ అనే పాడి రైతుకు చెందిన ఆవుకు శనివారం ఈ దూడ పుట్టింది. బుడి బుడి అడుగులతో ముద్దొస్తున్న ఈ పుంగనూరు గిత్తను చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు. 

Similar News

News March 8, 2026

యంగ్ సైంటిస్ట్ ఎక్స్‌పోలో తెల్లాపూర్ విద్యార్థుల సత్తా

image

నిర్మాణ్ యంగ్ సైంటిస్ట్ ఎక్స్‌పోలో రామచంద్రపురం మండలం తెల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు అదరగొట్టారు. మాదాపూర్‌లో జరిగిన పోటీల్లో వీరు రూపొందించిన ‘ఆల్కహాల్ డిటెక్టర్’ ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం దక్కినట్లు హెచ్ఎం భాస్కర్ తెలిపారు. 7వ తరగతి విద్యార్థులు కార్తీక్, శ్రీరామ్, 8వ తరగతి విద్యార్థులు శివానంద్, అగ్నిమణి ప్రతిభను ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

News March 8, 2026

కామారెడ్డి: మహిళా దినోత్సవం రోజు దారుణం

image

మహిళల గౌరవం గురించి ప్రపంచం మాట్లాడుకునే మహిళా దినోత్సవం రోజునే కామారెడ్డిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే తన ముగ్గురు చిన్నారి కూతుళ్లను చెరువులో పడేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన తండ్రి చేతిలోనే వారి ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని కలచివేసింది. ఆడపిల్లల భద్రత, విలువపై సమాజం మరింతగా ఆలోచించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది.

News March 8, 2026

శ్రీకాకుళం: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు వేళాయె!

image

మెరుగైన ఇంగ్లిష్ మీడియం విద్యకు చిరునామాగా మారిన ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 13 మోడల్ స్కూల్స్ ఉండగా, ఒక్క స్కూల్‌లో 100 సీట్లకు ప్రవేశాలుంటాయి. జిల్లాలో 1300 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్లో ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.