News February 25, 2025
పి.గన్నవరం: ఆటో నుంచి పడి నాలుగేళ్ల బాలుడి మృతి

పి.గన్నవరంలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివకోడు నుంచి వెళ్తున్న గూడ్స్ ఆటో నుంచి పడి ఆదిమూలం వారి పాలానికి చెందిన పవన్ శ్రీనివాస్ (4) మృత్యువాత పడ్డాడు. మార్చి 1న చిన్నాన్న పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన బాలుడు మృత్యుఒడికి చేరడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి తండ్రి నాగేంద్ర, తల్లి స్వర్ణ చిన్నకొడుకు శ్రీనివాసును హైదరాబాద్ నుంచి స్వగ్రామం పంపగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News December 13, 2025
భూపాలపల్లి: రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

పలిమెల, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.


