News January 25, 2025

పి.గన్నవరం: ఏడుగురు వీఆర్వోలకు షోకాజ్ నోటీసులు

image

పి.గన్నవరం మండలం మండలంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి ఏడుగురు వీఆర్వోలకు ఎమ్మార్వో శ్రీపల్లవి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణా నిలువరించడంలో నిర్లక్ష్య వైఖరి కారంణంగా ఈ నోటీసులు జారిచేసినట్లు పేర్కొన్నారు. పి.గన్నవరం, ఎల్.గన్నవరం, మానేపల్లి, మొండిపులంక, బెల్లంపూడి, ఊడిమూడి, జి.పెదపూడిలంక గ్రామాలకు చెందిన రెవెన్యూ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.

Similar News

News November 20, 2025

GHMC బర్త్, డెత్ సర్టిఫికెట్లు వాట్సాప్‌లోనే

image

మీసేవ వాట్సాప్ ద్వారా GHMC పరిధిలోని 30 సర్కిళ్లలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల వివరాలు అందుబాటులో ఉన్నట్లు ఉప్పల్ మీసేవ కేంద్ర అధికారులు తెలిపారు. డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి 2025 జూన్ రెండో తేదీ వరకు మరణించిన వారి వివరాలు మాత్రమే ఇందులో చూపిస్తున్నట్లుగా వినియోగదారులు తెలిపారు. ప్రజలు 80969 58096 నంబర్‌ సర్విస్‌ను వాట్సాప్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 20, 2025

పెరిగిన చలి.. కోళ్ల సంరక్షణలో జాగ్రత్తలు(2/2)

image

కోళ్లకు తాజా నీరు, దాణా మాత్రమే అందించాలి. కోళ్ల దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. దాణా బస్తాలను గోడలకు తగలకుండా చూడాలి. తేమ ఉన్న దాణా నిల్వ చేయకూడదు. బాగా ఎండిన దాణాను మాత్రమే నిల్వ ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనల మేరకే తగిన మోతాదులో ఆక్సిటెట్రాసైక్లిన్‌, సల్ఫాడిమిడిన్ వంటి యాంటీ బయాటిక్స్‌, ఇతర శానిటైజర్లు, విటమిన్‌లు, దాణా నీరు ఇవ్వాలి. కోళ్లకు అవసరమైన టీకాలు వేయించాలి.

News November 20, 2025

భక్తులకు TTD ఛైర్మన్ విజ్ఞప్తి ఇదే..!

image

గుర్తు తెలియని సంస్థలకు విరాళాలు ఇచ్చి వారి ఉచ్చులో పడవద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ‘గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, Savetemples.org ముసుగులో కొంతమంది వ్యక్తులు భక్తులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. చట్టవిరుద్ధమైన విరాళాలను కోరుతూ మోసగిస్తున్నట్లు నాకు తెలిసింది. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి’ అని ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.