News December 26, 2024
పి.గన్నవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
పి.గన్నవరం మండలం ఊడిమూడిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. పి. గన్నవరం నుంచి రావులపాలెం వైపు వెళ్తున్న ఆటోకు కుక్క అడ్డు రావటంతో దానిని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తో పాటు మరో మహిళకు గాయాలు కావడంతో వారిని స్థానికులు పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 28, 2024
సర్వే ఆధారంగా కచ్చితమైన నివేదికలు ఇవ్వాలి: కలెక్టర్
సముద్ర తీరా ప్రాంత ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లలో ఎంత మేర విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నాయనే అంశంపై జియో కో-ఆర్డినేట్ మ్యాపులతో సహా బృందాలు సర్వే ఆధారంగా కచ్చితంగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కాలుష్య నియంత్రణ మండలి, భూగర్భ జల శాఖ, మత్స్య శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆక్వా చెరువుల అనుమతులపై వివరాలు తెలుసుకున్నారు
News December 27, 2024
ఈవీఎంలకు పటిష్ట భద్రత: కలెక్టర్
ఈవీఎం, వీవీపాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కలెక్టరేట్ ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రెవిన్యూ, ఎన్నికలు అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు.
News December 27, 2024
ఉధారంగా రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్ ప్రశాంతి
జిల్లాలో కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరులో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని తూ.గో. జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం బ్యాంకర్లతో సమావేశం జరిగింది. డిసెంబరు 30న నాబార్డు ఆధ్వర్యంలో రొయ్యల రైతుల ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సు జరుగుతుందన్నారు. త్రైమాసిక ప్రణాళిక, పేదల ఆర్థిక అభ్యున్నతి, వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలపై దృష్టి సాధించాలన్నారు.