News March 10, 2025

పి4 సర్వే సర్వేను వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్

image

పీఫోర్ సర్వే సమర్థవంతంగా నిర్వహించడంతో సామాన్యుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఆదివారం ఆకివీడులో జరుగుతున్న బిఫోర్ సర్వే‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువతను ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా సర్వేను పూర్తి చేయాలని ఆమె సిబ్బందికి దిశా నిర్దేశించారు.

Similar News

News March 15, 2025

ప.గో: నెత్తురోడిన రహదారులు.. ఐదుగురు మృతి

image

శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాడేపల్లిగూడెం వద్ద హైవేపై వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టగా చిన్నారితో సహా తల్లిదండ్రులు <<15760017>>మృతి చెందారు.<<>> కృష్ణా(D) ఘంటలసాల(M) జీలగలగండిలోని హైవేపై <<15755822>>లారీని బోలెరో ఢీకొన్న<<>> ఘటనలో ప్రాతాళ్లమెరకకు చెందిన వర ప్రసాద్, శివకృష్ణ చనిపోయారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

News March 14, 2025

పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

image

రాష్ట్రంలో రెండు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే మంజూరు కాగా, అందులో ఒకటి, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పాలకొల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి ప్రారంభించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. 

News March 14, 2025

రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు వాసి మృతి

image

రాజమండ్రి మోరంపూడి ఫ్లై ఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు(M) గొల్లవాని చెరువుకు చెందిన సాయినరేశ్ (30) మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన రమేశ్ తో బొమ్మూరు వైపు వెళ్తుండగా.. వెనుకనుంచి కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని గురువారం కుటుంబీకులకు బొమ్మూరు పోలీసులు అప్పగించి, కేసు నమోదు చేశారు. నరేశ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

error: Content is protected !!