News October 9, 2024
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డి

పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డిని ఎన్నుకున్నట్లు జిల్లా పీఆర్టీయు అధ్యక్షుడు మానయ్య తెలిపారు. మహిపాల్ రెడ్డి సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పించినందుకు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 26, 2025
చిన్న శంకరంపేట: గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం

చిన్న శంకరంపేట మండలం దరిపల్లి శివారులోని హల్దీ వాగులో గుర్తు తెలియని మహిళ శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన మహిళ ఎవరు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామంలో ఎవరైనా తప్పిపోయారా లేదా ఇతర గ్రామాల నుంచి వచ్చిన మహిళ ఇక్కడ చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
చిన్నశంకరంపేట: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గవలపల్లి ఎక్స్ రోడ్డులోని వైన్స్ పర్మిట్ రూమ్ ఎదురుగా అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అంబాజీపేట గ్రామానికి చెందిన బండారు వెంకటేశం(40)గా గుర్తించారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News October 26, 2025
మెదక్: ‘పది రోజుల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌పై కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సమీక్షించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఆయన తహశీల్దార్లు, ఆర్డీఓలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల తర్వాత దరఖాస్తులను తప్పకుండా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.


