News July 31, 2024
‘పీఎంశ్రీ’ పథకానికి ఖమ్మం 28, భద్రాద్రి 20 పాఠశాల ఎంపిక

కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న ‘పీఎంశ్రీ’ (ప్రైమ్ మినిస్టర్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకానికి ఖమ్మం జిల్లా 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఎంపికైన పాఠశాల నిర్వాహకులు విద్యార్థులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్తున్నారు. మరొకవైపు మిగతా పాఠశాలకు కూడా ఈ పథకం అమలు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.
Similar News
News February 23, 2026
‘దిశ’ సమావేశానికి అధికారులు సిద్ధంగా రావాలి: కలెక్టర్

ఈ నెల 27న నిర్వహించే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పరిపాలన అంశాలపై సమీక్షించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ.10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని అధికారులను సూచించారు.
News February 23, 2026
ఖమ్మం: ‘వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధం’

రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటికే గరిష్ఠ డిమాండ్ 5,904మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. అదనంగా 110కొత్త ట్రాన్స్ఫార్మర్లు, మంచుకొండ వద్ద కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓవర్ లోడ్ సమస్య లేకుండా సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
News February 23, 2026
ఖమ్మం జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు!

ఖమ్మం జిల్లాలో వేసవి రాకముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 2 అడుగుల మేర నీటిమట్టం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎర్రుపాలెం, మధిర, కామేపల్లి మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. విచ్చలవిడి వాడకం, నీటి పొదుపు లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మే నాటికి జల సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని భూగర్భజల శాఖ హెచ్చరిస్తోంది.


