News February 21, 2025
పీఎం సూర్యఘర్ లక్ష్యాలపై దృష్టిపెట్టండి: కలెక్టర్

పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రిజిస్ట్రేషన్లతో పాటు సౌర ఫలకాల ఏర్పాటుపై ప్రతి మండలానికి నిర్దేశించిన లక్ష్యాలపై అధికారులు దృష్టిసారించాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్ పథకంపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లతో పాటు ఇన్‌స్టలేషన్స్‌పై చర్చించారు.
Similar News
News November 19, 2025
హోటల్ రూమ్‌లకు భలే డిమాండ్

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తుండటంతో పుట్టపర్తిలో లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. రూ.5 వేలు పెట్టినా రూములు దొరకడం లేదు. అయితే, ట్రస్ట్ తరఫున 50 వేల మందికి సరిపడేలా వసతి షెడ్లు ఏర్పాటు చేసి, మూడు పూటలా భోజన సౌకర్యం కల్పించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయానికి ఉతచి బస్సులు ఏర్పాటు చేశారు. దేవభూమి ఆధ్యాత్మక శోభతో వెలుగొందుతోంది.
News November 19, 2025
బాలికను రెండేళ్లుగా చీకటి గదిలో నిర్బబంధించిన తల్లి

చీకటి గదిలో రెండేళ్లుగా మగ్గుతున్న ఓ బాలికకు న్యాయాధికారి చొరవతో విముక్తి లభించింది. ఈ ఘటన ఇచ్ఛాపురంలోని చక్రపాణి వీధిలో నిన్న వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన తల్లి ఆడపిల్లను బయటకు పంపితే ఏం జరుగుతుందోని భయంతో ఇలా బంధించింది. స్థానికుల సమాచారంతో న్యాయాధికారి, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు వీరిద్దర్నీ బయటకి తీసుకొచ్చారు. పరిస్థితి బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.
News November 19, 2025
తొలి ఆదివాసీ అగ్రనేత హిడ్మాయే!

భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన హిడ్మా ప్రస్థానం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో ఆదివాసీ గ్రామ ఆర్గనైజర్‌గా ప్రారంభమైంది. అనంతరం మావోయిస్టుల యాక్షన్ టీమ్ ఇన్‌ఛార్జ్‌గా ఎదిగి, చివరకు కేంద్ర కమిటీకి చేరిన తొలి ఆదివాసీ అగ్రనేతగా నిలిచాడు. భద్రతా బలగాలను తప్పుదారి పట్టించి, దాడులు నిర్వహించడం హిడ్మా స్టైల్. మావోయిస్టుల నిఘా వ్యవస్థతో పాటు హిడ్మాకు ప్రత్యేక వ్యవస్థ ఉండేది.


