News August 5, 2024
పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: కలెక్టర్
నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పీజీఆర్‌ఎస్) ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.
Similar News
News September 13, 2024
కర్నూలు జిల్లాలో రైలు మార్గం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?
కర్నూలు జిల్లాలో మొట్టమొదటి రైలు మార్గం 1870లో ప్రారంభమైంది. ముంబై, చెన్నైలను కలుపుతూ ఏర్పడిన రైలు మార్గం ఆదోని, ఆలూరు ప్రాంతాల మీదుగా 97 కి.మీ మేర ఉంటుంది. దీంతో ఎగుమతులు, దిగుమతులకు ఆదోని కేంద్రంగా మారింది. అందుకే ఈ ప్రాంతానికి రెండో బాంబేగా పేరు వచ్చిందట. 1909లో కర్నూలు-డోన్, 1930లో కర్నూల్- హైదరాబాద్‌కు రాకపోకలు ప్రారంభమయ్యాయి. 1921 SEP 29న జాతిపిత మహాత్మా గాంధీ రైలులోనే కర్నూలుకు వచ్చారు.
News September 13, 2024
మంత్రి బీసీ ఆధ్వర్యంలో 18న మెగా జాబ్ మేళా
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 18న బనగానపల్లె డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సతీమణి బీసీ ఇందిరారెడ్డి వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు 9 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. 1,191 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులన్నారు.
News September 13, 2024
నగదు వసూలు చేస్తే చర్యలు: కలెక్టర్
ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ల నుంచి నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను అదేశించారు. గురువారం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కింద వస్తే ఉచితంగా చికిత్స ఇవ్వాలని, లేకపోతే అప్పుడు వారి నుంచి నగదు తీసుకునే ప్రక్రియను అన్ని ఆసుపత్రులు పాటించాలని అన్నారు.