News March 30, 2025

పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

ఈనెల 31న రంజాన్ పండుగను పురస్కరించుకొని సోమవారం కర్నూలు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు లెక్టర్ పీ.రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, వ్యయ ప్రయాసలతో జిల్లా కేంద్రానికి రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 27, 2026

358 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. మొత్తం 5,069 మంది విద్యార్థులకు గానూ 4,711 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

News February 27, 2026

‘కర్నూలు జిల్లాలో పుష్కలంగా ఎరువుల నిల్వలు’

image

2025-26 రబీ సీజన్‌కు సంబంధించి కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లా అవసరాల కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 27, 2026

బాలిక హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.