News March 1, 2025
పీజీఎంసీతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ సీఆర్డీఏ

అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీజీఎంసీ)తో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఎం.నవీన్, సుర్బానా జురాంగ్, నైట్ ఫ్రాంక్ సంస్థల ప్రతినిధులతో కలిసి ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. వరల్డ్ బ్యాంక్ నిధులతో నిర్మించనున్న రాజధాని పనులలో ఆయా ప్రమాణాల అమలులో పీజీఎంసీ CRDAకు సహకరిస్తుందని నవీన్ చెప్పారు.
Similar News
News November 28, 2025
MHBD: పాత బిల్లులు రాలే.. పోటీ చేయాలా? వద్దా?

గత ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచులకు ప్రభుత్వం మారినా ఇప్పటికీ అభివృద్ధి పనుల బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసొచ్చిన నాయకులు మళ్లీ పోటీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోయారు. పోటీ చేస్తే ఖర్చుపెట్టినా మళ్లీ గెలుస్తామో? గెలవమో? అని నాయకులు జంకుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 482 పంచాయతీలు ఉన్నాయి.
News November 28, 2025
గట్టుప్పల్: అక్కడ ఓటు వేయాలంటే.. 3 కిలోమీటర్లు నడవాల్సిందే!

గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లకు ఓటు వేసేందుకు తిప్పలు తప్పడం లేదు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని రంగంతండా, అజనాతండా, దేవులతండా, రాగ్యాతండాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. సుమారు 3 కి.మీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నాలుగు తండాల్లో సుమారు 650 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
News November 28, 2025
MHBD జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

MHBD, కేసముద్రం, మరిపెడ, తొర్రూర్, డోర్నకల్ మున్సిపాలిటీలు మినహా.. మిగిలిన 18 మండలాల్లో మొత్తం 5,56,780 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో మహిళలు 2,83,064 ఉండగా, 2,73,682 మంది పురుషులు, 24 మంది ఇతరులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 482 గ్రామపంచాయతీ, 4110 వార్డు స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు కాగా.. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.


