News March 1, 2025

పీజీఎంసీతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ సీఆర్డీఏ 

image

అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ(పీజీఎంసీ)తో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఎం.నవీన్, సుర్బానా జురాంగ్, నైట్ ఫ్రాంక్ సంస్థల ప్రతినిధులతో కలిసి ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. వరల్డ్ బ్యాంక్ నిధులతో నిర్మించనున్న రాజధాని పనులలో ఆయా ప్రమాణాల అమలులో పీజీఎంసీ CRDAకు సహకరిస్తుందని నవీన్ చెప్పారు. 

Similar News

News March 20, 2025

125 గ్రామాలకు 118.11 లక్షలు: KMR కలెక్టర్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారులతో తాగు నీటి సమస్యలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ.118.11 లక్షల అంచనాలతో పనులు చేపట్టుటకు జీపీ, కృషియాల్ బ్యాలెన్స్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

News March 20, 2025

SRD: పరీక్ష కేంద్రాల 163 BNSS సెక్షన్: ఎస్పీ

image

జిల్లాలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ బుధవారం తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు ఐదుగురుకు మించి తిరగవద్దని చెప్పారు. పరీక్ష జరిగే సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లు మూసి ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.

News March 20, 2025

ASF: గంజాయి పట్టివేత.. నిందితుడిపై కేసు

image

తిర్యాణి మండలం నాయకపుగూడ గ్రామానికి చెందిన మెంద్రపు చిన్నయ్య ఇంట్లో 875 గ్రాముల గంజాయిని బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు చిన్నయ్య ఇంట్లో తనిఖీ చేశామన్నారు. సుమారు రూ.21 వేల విలువైన గంజాయి లభ్యమైనట్లు చెప్పారు. గంజాయిని సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!