News November 9, 2024
పీజీ ప్రవేశ పరీక్ష చివరి దశ సీట్ల కేటాయింపు

తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల్లో M.A, M.Sc, M.Com, M.Lib.Science లాంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష (CPGET)-2024 ఫైనల్ పేజ్ సీట్లు శుక్రవారం కేటాయించారు. సీటు పొందిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రుసుము చెల్లించి, ఈనెల 12 లోపు సంబంధిత కళాశాలలో ఒరిజినల్ టీసీ సమర్పించాలని అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డి తెలిపారు.
Similar News
News October 31, 2025
HYD సంస్థానం గురించి తెలుసా?

ప్రపంచప్రఖ్యాత HYD సంస్థానాన్ని 16 జిల్లాలుగా విభజించారు. తెలంగాణ 8, మరాఠ 5, కన్నడ 3 జిల్లాలుగా విస్తరించారు. అనేక రాజవంశాల పాలనలో సుసంపన్నమైన ఈ సంస్థానాన్ని 1724లో మీర్ కమర్-ఉద్-దిన్ ఖాన్ సిద్దిఖీ అసఫ్జాహీ వంశాన్ని స్థాపించి 224 ఏళ్లు పరిపాలించారు. కాలక్రమంలో వీరి అరాచకాలు ఢిల్లీకి చేరాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బలగాలతో ఇక్కడికి వచ్చి సంస్థానాన్ని భారతమాత ఒడిలో విలీనం చేశారు.
News October 31, 2025
జూబ్లీహిల్స్: రోజుకు 2 డివిజన్లలో సీఎం ప్రచారం

సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా ప్రచారం సాగనుంది. PJR సర్కిల్ నుంచి జవహర్నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ (చాకలి ఐలమ్మ విగ్రహం) వరకు రోడ్ షో.సాయిబాబా టెంపుల్ ఆవరణలో కార్నర్ మీటింగ్లో ప్రసంగం, సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా వద్ద మరో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు.
News October 31, 2025
డాక్టర్స్ స్పెషల్: ఎల్బీస్టేడియంలో టెన్నిస్ టోర్నమెంట్

ఎప్పుడూ రోగులు, వైద్యం అంటూ బిజీ బిజీగా ఉండే వైద్యులు ఈ వీకెండ్ సేదతీరనున్నారు. టెన్నిస్ టోర్నమెంటులో పాల్గొని రిలాక్స్ కానున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు డాక్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డా.అర్జున్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్యులు సందడి చేయనున్నారు.


