News August 22, 2024

పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ విన్నర్‌గా వరంగల్ యువతి

image

దేశాయిపేట శివారు లక్ష్మిటౌన్‌ షిప్‌కు చెందిన దీక్షిత పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఈనెల 14 నుంచి 17 వరకు HYDకు చెందిన మాంటి ప్రొడక్షన్‌ సంస్థ మిస్టర్‌ అండ్‌ మిస్‌ గార్జియస్‌ ఆఫ్‌ ఇండియా (సీజన్‌-4) పోటీలను నిర్వహించింది.క్యాన్సర్‌ బాధితులకు ఫడ్‌ రేసింగ్, మహిళలు క్యాన్సర్‌ బారిన పడకుండా ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలపై చేసిన సూచనలకు పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ దక్కినట్లు ఆమె తెలిపారు.

Similar News

News December 4, 2025

వరంగల్: ఇక ‘గుర్తుల’ ప్రచారం..!

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అభ్యర్థులు గుర్తులు లేకుండానే గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో ఇక వాటితో ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వారికి కేటాయించిన గుర్తులతో హోరెత్తిస్తున్నారు.

News December 3, 2025

నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిన చూడాలి: కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. అమిన్‌పేట క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు, అభ్యర్థుల రద్దీ, సమర్పణ ప్రక్రియను ఆమె సమగ్రంగా పరిశీలించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.