News February 12, 2025

పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అసహనం

image

కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ తన హక్కును కోరడాన్ని చిన్నచూపుగా అభివర్ణించడం బాధాకరమని మంత్రి అన్నారు. దేశానికి భారీగా ఆదాయం అందిస్తున్న తెలంగాణకు తగిన న్యాయం జరగాలని కోరడం న్యాయమేనని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గుర్తించి, వాటి అభివృద్ధికి కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

Similar News

News February 13, 2025

అమెరికా నిఘా డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్

image

భారత సంతతి వ్యక్తి తులసీ గబ్బార్డ్‌ను తమ దేశ నిఘా సంస్థ డైరెక్టర్‌గా అమెరికా అధికారికంగా నియమించింది. తాజాగా జరిగిన సెనేట్ ఓటింగ్‌లో ఆమెకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌గా అక్కడి 18 నిఘా సంస్థల కార్యకలాపాలను తులసి పర్యవేక్షిస్తారు. కీలక సమస్యలపై ట్రంప్‌కు సలహాదారుగా వ్యవహరిస్తారు. అమెరికాపై 2001లో ఉగ్రదాడుల అనంతరం ఈ పదవిని ఏర్పాటు చేశారు.

News February 13, 2025

మెదక్: కాంగ్రెస్‌లో చేరిన మాజీ డీఎస్పీ 

image

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎం.గంగాధర్ బుధవారం ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల గంగాధర్ డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు.

News February 13, 2025

మోర్తాడ్: జాతీయస్థాయి కబడ్డీకి ఎంపిక

image

మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన కుంట సుశాంక్ జాతీయ స్థాయి సీనియర్ కబడ్డి ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుడు ఎంపికవడంపై జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు పలువురు అభినందించారు. తుది జట్టు ఎంపిక తర్వాత ఒడిషా రాష్టంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు.

error: Content is protected !!