News November 22, 2024
పీయూసీ ఎన్నికకు ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి నామినేషన్
అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) సభ్యుల ఎన్నికకు ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాం గోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈయన 2023లో టీడీపీ నుంచి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేకాకుండా కడప జిల్లాలో టీడీపీ విజయానికి ఆయన కృషి చేశారు. ఇటీవల పులివెందులలో జగనన్న లేఅవుట్లలో అవినీతి జరిగిందని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News November 23, 2024
నిమ్మ పంటను పరిశీలించిన కడప జిల్లా కలెక్టర్
పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కలసపాడు తహశీల్దారు కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనులపై అరా తీశారు. అనంతరం తెల్లపాడు గ్రామపంచాయతీ దూలంవారిపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద లబ్ధి పొందిన రైతు పొలంలో పర్యటించారు. కొమ్ముల హరి అనే రైతు సాగు చేసిన నిమ్మ పంటను సూసి సంతోషించారు.
News November 22, 2024
కడప: అధికారులు ప్రాథమిక విధులు విస్మరించరాదు.!
రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ భూముల కేటాయింపు విషయంలో ప్రాథమిక విధులను విస్మరించకుండా SOP ప్రకారం బాధ్యతలను నిర్వహించాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ విషయాలపై శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. భూముల రీ సర్వే, భూ రికార్డుల స్వచ్చీకరణ, ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్, భూసేకరణ రెవెన్యూ శాఖలో పెండింగ్ అంశాలు తదితర అంశాలపై చర్చించారు.
News November 22, 2024
జగన్ను ఒక్క సారైనా అసెంబ్లీకి రప్పించండి: ఎమ్మెల్యే ఆది
జగన్ అవినీతిలో ఎస్కోబార్ను కూడా దాటేశారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘జగన్ను నేను దగ్గర నుంచి చూశా. అతను రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రూ.లక్ష కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటుంది‘ అని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం ఆ జగన్ను ఒక్కసారైనా అసెంబ్లీకి రప్పించండి అని ఆదినారయణ రెడ్డి అనగానే సభ్యులతో పాటు సీఎం చంద్రబాబు సైతం నవ్వుకున్నారు.