News March 21, 2025
పీయూ: ఆ సర్క్యూలర్‌ను వాపస్ తీసుకోవాలని SFI నిరసన

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధిస్తూ వీసీ విడుదల చేసిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని, HCUలో 400 ఎకరాల భూములను వేలం వేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని SFI PU అధ్యక్షుడు బత్తిని రాము పాలమూరు యూనివర్సిటీ PG కాలేజ్ ముందు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు రాజేశ్, శ్రీనివాస్, విద్యుల్లత, ఈదన్న, సాయి, శిరీష, రాంచరణ్ పాల్గొన్నారు.
Similar News
News April 2, 2025
ఊర్కోండ: ఒంటరి మహిళ, ప్రేమ జంట కనిపిస్తే అంతే సంగతులు!

ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
News April 2, 2025
బాలానగర్: రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బీహార్ వాసి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన బినోద్ ముర్ము(32) మండల కేంద్రం శివారులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News April 2, 2025
MBNR: నేడు ఎస్ఎల్బీసీకి మంత్రి పొంగులేటి రాక

ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు వదిలిన వారి ఆచూకీ కోసం 38 రోజులుగా సహాయక కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో 600 మంది రెస్క్యూ బృందాలు శ్రమిస్తూనే ఉన్నారు. ఈ చర్యలను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రానున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే లు రానున్నారు.