News October 17, 2024
పీహెచ్సీ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్
పీహెచ్సీలలో నిర్మాణ దశలలో ఉన్న బ్లాక్ లెవెల్ హెల్త్ యూనిట్లను త్వరితగతిన పూర్తి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఎనిమిది బ్లాక్ లెవెల్ హెల్త్ యూనిట్ల పురోగతిపై సంబంధిత వైద్య అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు నిర్వహించే స్కానింగ్ కోసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News December 28, 2024
CA ఫలితాల్లో ‘టాప్‘ లేపిన చిత్తూరు జిల్లా కుర్రాడు
జాతీయ స్థాయిలో జరిగిన చార్టెర్డ్ అకౌంటెంట్(CA) తుది ఫలితాల్లో చిత్తూరు జిల్లా వాసి అగ్రస్థానం కౌవసం చేసుకున్నాడు. తాజాగా వెలవడిన ఫలితాల్లో పలమనేరుకు చెందిన రిషబ్ ఓత్సవాల్ 600 మార్కులకు గాను 508 మార్కులు సాధించి మరో విద్యార్థితో సమానంగా నిలిచాడు. దీంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండిమా(ICIA) ఇద్దరికి ప్రథమ స్థానం కేటాయించింది. వారికి పలువురు అభినందనలు తెలిపారు.
News December 28, 2024
చిత్తూరు: 30 నుంచి దేహదారుడ్య పరీక్షలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలకు ఉత్తీర్ణులైన వారికి డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. 990 మంది మహిళలు, 4248 మంది పురుషులు జిల్లా పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఈ మేరకు సిబ్బందికి పోలీసు గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో అవగాహన కల్పించారు.
News December 28, 2024
తిరుపతి: విద్యార్థిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్ అరెస్ట్
తిరుపతి వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని లైంగికంగా వేధించిన ప్రొ.ఉమామహేశ్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన విద్యార్థి వర్సిటీలో మొదటి సం.చదువుతోంది. ఆమె తరగతి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రొ. లైంగింకంగా వేధించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.