News October 17, 2024
పీహెచ్సీ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్
పీహెచ్సీలలో నిర్మాణ దశలలో ఉన్న బ్లాక్ లెవెల్ హెల్త్ యూనిట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఎనిమిది బ్లాక్ లెవెల్ హెల్త్ యూనిట్ల పురోగతిపై సంబంధిత వైద్య అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు నిర్వహించే స్కానింగ్ కోసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News November 11, 2024
తిరుపతి: సైబర్ నేరాల పట్ల DGP అవగాహన
సైబర్ క్రైమ్, డ్రగ్స్, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ ద్వారకా తిరుమలరావు సోమవారం అవగాహన కల్పించారు. ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని సుమారు 900 పాఠశాలలు, 60 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను DGP వివరించారు. మహిళా దాడులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని చెప్పారు.
News November 11, 2024
తిరుపతి: CM, Dy CM కుటుంబీకుల చిత్రాలు మార్ఫింగ్
CM, Dy.CM కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సైదిరెడ్డి ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 19న చంద్రబాబు, పవన్ కుటుంబసభ్యుల చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. కార్వేటినగరానికి చెందిన టీడీపీ నేత సంధాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడు సైదిరెడ్డిని కార్వేటినగరం CI హనుమంతప్ప అరెస్ట్ చేశారు.
News November 11, 2024
మదనపల్లె పూర్వ RDO అక్రమ ఆస్తులు రూ.230 కోట్లు!
మదనపల్లె పూర్వ RDO MS మురళి భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు మురళి కూడబెట్టిన ఆస్తులపై శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. కిలో బంగారు ఆభరణాలు, 800 గ్రా. వెండి, ఏడు ఇళ్లు, ఒక హోటల్, 12 స్థలాలు, 20 బ్యాంకు ఖాతాలు, 8 లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ రూ.230 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆయనను ఆదివారం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు.